Daggubati Purandeswari: అది తప్పని నిరూపిస్తే రూ.1 లక్ష బహుమానం అని మా నేత ప్రకటించారు: పురందేశ్వరి

Purandeswari demands action on CI
  • మంగళగిరి ఎయిమ్స్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ
  • ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన యువ మోర్చా నేత
  • సదరు నేతపై సీఐ దాడి చేశాడన్న పురందేశ్వరి

ఇవాళ మంగళగిరి ఎయిమ్స్ ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ యువ మోర్చా నేత ఒకరు ఎయిమ్స్ ప్రారంభోత్సవం నేపథ్యంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తే, సీఐ ఆ నేతపై దాడి చేశాడని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి ఆరోపించారు. యువ మోర్చా నేత ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంలో తప్పేమీ లేదని అన్నారు.

 రాజకీయాలతో పని లేకుండా ఏపీకి కేంద్రం సహకారం అందిస్తోందని తెలిపారు. అందులో భాగంగానే ఎయిమ్స్ కు నిధులు అందించిందని, ఈ విషయం తప్పని నిరూపిస్తే రూ.1 లక్ష బహుమానం ఇస్తామని తమ నేత ప్రకటించారని పురందేశ్వరి వివరించారు. అందులో అభ్యంతరం వ్యక్తం చేయాల్సింది ఏముందని ప్రశ్నించారు. సదరు సీఐపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పురందేశ్వరి డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News