Velagapudi Ramakrishna Babu: ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు అంతర్జాతీయ నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్

Threat calls to Velagapudi Ramakrishna Babu from international numbers
  • టీడీపీ మొదటి జాబితాలో అవకాశం దక్కించుకున్న వెలగపూడి
  • గత రాత్రి ఆయనకు బెదిరింపు కాల్స్
  • చంపేస్తామంటూ హెచ్చరికలు
  • తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరిన వెలగపూడి
విశాఖ తూర్పు ఎమ్మెల్యే, టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణబాబు పోలీసులను ఆశ్రయించారు. తనను చంపేస్తామంటూ అంతర్జాతీయ ఫోన్ నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఫిర్యాదు చేశారు. గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయని, వారు తనను తీవ్రంగా దూషించారని వివరించారు. బెదిరింపుల నేపథ్యంలో తనకు రక్షణ ఇవ్వాలని, బెదిరింపు కాల్స్ చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని వెలగపూడి రామకృష్ణబాబు పోలీసులను కోరారు. అంతర్జాతీయ ఫోన్ నెంబర్ల వివరాలను కూడా ఆయన పోలీసులకు అందించారు.
Velagapudi Ramakrishna Babu
Threat Calls
International Numbers
Visakha East
TDP

More Telugu News