Rohit Sharma: హెల్మెట్ లేకుండా షార్ట్ లో ఫీల్డింగ్ చేస్తున్న సర్ఫరాజ్ పై రోహిత్ శర్మ వ్యాఖ్యలు... వీడియో ఇదిగో!

Rohit Sharma comments on Sarfaraz went viral
  • రాంచీలో టీమిండియా, ఇంగ్లండ్ టెస్టు
  • ఇంగ్లండ్ బ్యాటింగ్ చేస్తుండగా సంఘటన
  • తమ్ముడూ... హీరో అవ్వాలనుకోవద్దమ్మా అంటూ రోహిత్ వ్యాఖ్యలు
  • వెంటనే హెల్మెట్ తెప్పించుకుని పెట్టుకున్న సర్ఫరాజ్

రాంచీలో టీమిండియా, ఇంగ్లండ్ మధ్య టెస్టు మ్యాచ్ సందర్భంగా మైదానంలో ఆసక్తికర సంఘటన జరిగింది. ఇంగ్లండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సర్ఫరాజ్ ఖాన్ షార్ట్ లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. 

అయితే, ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ కు సమీపంలో ఫీల్డింగ్ చేస్తున్న సర్ఫరాజ్ హెల్మెట్ పెట్టుకోకపోవడాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ గమనించాడు. వెంటనే, బౌలింగ్ ఆపేయమని చెప్పాడు. సర్ఫరాజ్ ను ఉద్దేశించి "తమ్ముడూ... హీరో అవ్వాలనుకోవద్దమ్మా... హెల్మెట్ పెట్టుకో" అంటూ  తనదైన శైలిలో చెప్పాడు. దాంతో సర్ఫరాజ్ డ్రెస్సింగ్ రూం నుంచి వెంటనే హెల్మెట్ తెప్పించుకుని పెట్టుకున్నాడు. 

దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా, రోహిత్ శర్మ వ్యాఖ్యలకు సర్ఫరాజ్ కొంచెం చిన్నబుచ్చుకున్నట్టు అతడి ముఖం చూస్తే అర్థమవుతుంది.

  • Loading...

More Telugu News