KTR: లాస్య నందిత మృతిపై కేటీఆర్ భావోద్వేగం..!

BRS Working President Gets Emotional On Lasya Nanditha Sudden Death
  • విదేశాల్లో ఉన్నందువల్లే రాలేకపోయానని వెల్లడి
  • ఆదివారం ఎమ్మెల్యే కుటుంబానికి పరామర్శ
  • ఉదయమే ఇంటికి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. లాస్య ఆకస్మిక మరణం కలిచివేసిందని చెప్పారు. ఈమేరకు ఆదివారం ఉదయం లాస్య నందిత నివాసానికి వెళ్లిన కేటీఆర్.. లాస్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. లాస్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పార్టీ అండగా ఉంటుందని లాస్య కుటుంసభ్యులకు ధైర్యం చెప్పారు. 

రోడ్డు ప్రమాదంలో లాస్య మృతిచెందిన విషయం తెలిసి చాలా బాధపడ్డానని కేటీఆర్ మీడియాతో పేర్కొన్నారు. ఆ సమయంలో తాను విదేశాలలో ఉండడం వల్ల విషయం తెలిసినా వెంటనే రాలేకపోయానని వివరించారు. గడిచిన పది రోజుల్లో లాస్యను ప్రమాదాలు వెంటాడాయని, చివరకు మృత్యువు కబళించిందని విచారం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం ఓఆర్ఆర్ పై జరిగిన కారు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం పాలైన విషయం తెలిసిందే.
KTR
Lasya Nanditha
MLA
BRS
Lasya Death
Road Accident

More Telugu News