కారు మారి ప్రాణాలతో బయటపడిన బాలిక శ్లోక.. లాస్య నందిత కారు ప్రమాదంపై దర్యాప్తు వేగవంతం
- రెడీమిక్స్ వాహనం కానీ, టిప్పర్ కానీ ఢీకొట్టి ఉంటుందని అనుమానం
- ఎమ్మెల్యే కారుపై రాక్‌శాండ్ పడి ఉండడంతో పోలీసుల అనుమానం
- ఎమ్మెల్యే పీఏ రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపిన పోలీసులు
- ఆయన సెల్‌ఫోన్ డేటా విశ్లేషణ
కారు మారడంతో బతికిపోయిన బాలిక
ఎమ్మెల్యే లాస్యనందిత తరచూ అనారోగ్యం పాలవుతుండడం, రెండు రోడ్డు ప్రమాదాల నుంచి బయటపడడంతో కుటుంబ సభ్యులు, బంధువుల సూచనతో ఈ నెల 22న రాత్రి సదాశివపేట మండలం ఆరూర్‌లోని మిస్కిన్‌పాషా దర్గాకు వెళ్లి పూజలు చేయించుకున్నారు. అనంతరం తెల్లవారుజామున తిరిగి ఇంటికి బయలుదేరారు. ఒక కారులో ఎమ్మెల్యే, ఆకాశ్‌తోపాటు చిన్నారి శ్లోక ఉండగా, మరో కారులో ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. అయితే, శ్లోక పాఠశాలకు వెళ్లాల్సి ఉండడంతో త్వరగా పంపేందుకు కుటుంబ సభ్యులున్న కారులోకి మార్చారు. తాను టిఫిన్ చేసి వస్తానని, మీరు వెళ్లాలని వారిని పంపించారు. ఆ తర్వాత కాసేపటికే ప్రమాదం జరిగి లాస్య ప్రాణాలు కోల్పోయారు.