Nirmala Sitharaman: ముంబై లోకల్ ట్రెయిన్ ప్రయాణికులకు ఆర్థిక మంత్రి సర్‌ప్రైజ్

Finance Minister Nirmala Sitharaman travels in Mumbai local train
  • శనివారం ముంబై లోకల్ ట్రెయిన్‌లో నిర్మలా సీతారామన్ ప్రయాణం 
  • ఘట్కోపర్ నుంచి కల్యాణ్ వరకూ సామాన్యులతో కలిసి జర్నీ చేసిన మంత్రి
  • మంత్రితో సెల్ఫీ దిగేందుకు పలువురి ఉత్సాహం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామాన్ శనివారం ముంబై లోకల్ ట్రెయిన్‌లో జర్నీ చేశారు. ఘట్కోపర్ నుంచి కల్యాణ్ వరకూ ఆమె ప్రయాణించారు. నిత్యం బిజీగా ఉండే ఆర్థిక మంత్రి తమతో పాటూ ప్రయాణించడం చూసి రైల్లోని ప్రయాణికులు సర్‌ప్రైజ్ అయ్యారు. పలువురు మంత్రితో సెల్ఫీలు దిగారు. ప్రయాణం సందర్భంగా పలువురితో నిర్మలా సీతారామన్ ముచ్చటించారు. ఓ చిన్నారిని కూడా పలకరించారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను ఆర్థిక మంత్రి కార్యాలయం ట్విట్టర్ వేదికగా పంచుకుంది. 

అయితే, ఆర్థిక మంత్రి సామాన్యులతో కలిసి ప్రయాణించడం ఇదే తొలిసారిగా కాదు. గతేడాది నవంబర్‌లో ఆమె కేరళలో వందేభారత్ రైల్లో ప్రయాణించారు. జర్నీ అద్భుతంగా ఉందని ఆ తరువాత వ్యాఖ్యానించారు.
Nirmala Sitharaman
Mumbai
Maharashtra
Viral Pics

More Telugu News