Renu Desai: అందుకే వైర్ ఉండే ఇయర్ ఫోన్స్ వాడమని అకీరా, ఆద్యలకు చెబుతుంటాను: రేణూ దేశాయ్

Renu Desai says she advised Akira and Adya to use wired ear phones instead of blutooth
  • బ్లూటూత్ వల్ల చెవులు, మెదడు కణజాలం దెబ్బతింటుందన్న రేణూ
  • తన సలహాను అకీరా పాటించాడని వెల్లడి
  • ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు 

బ్లూటూత్ టెక్నాలజీ వల్ల చెవులు, మెదడు కణజాలం దెబ్బతినే అవకాశం ఉంటుందని ప్రముఖ నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ వెల్లడించారు. అందుకే వైర్ లెస్ ఇయర్ ఫోన్స్ బదులు, వైర్ ఉండే ఇయర్ ఫోన్స్ ఉపయోగించాలని తన పిల్లలు అకీరా, ఆద్యలకు చెబుతుంటానని వివరించారు. తన సలహాను అకీరా పాటిస్తున్నాడని, ఇటీవల ఫ్యాన్సీ వైర్ లెస్ హెడ్ ఫోన్స్ కు బదులు వైర్ ఉన్న ఇయర్ ఫోన్స్ నే ఉపయోగిస్తున్నాడని సంతోషం వ్యక్తం చేశారు. నిదానంగానే అయినా తన అలవాటును మార్చుకున్నాడని వివరించారు. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు పెట్టారు.

  • Loading...

More Telugu News