TDP List: తొలి జాబితాలో టికెట్ దక్కని టీడీపీ కీలక నేతలు వీరే!

TDP key leaders missed berth in first list
  • 94 మంది పేర్లతో తొలి జాబితా విడుదల చేసిన చంద్రబాబు
  • తొలి జాబితాలో లేని గంటా, ఆనం, బుచ్చయ్య చౌదరి తదితరుల పేర్లు
  • రెండో జాబితాపై ఆశలు పెట్టుకున్న నేతలు

ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో టీడీపీ - జనసేన కూటమి వేగం పెంచింది. ఈరోజు తొలి జాబితాను విదుడల చేసింది. ఈ ఎన్నికల్లో జనసేన 24 అసెంబ్లీ, 3 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయబోతోంది. తొలి జాబితాలో భాగంగా చంద్రబాబు 94 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అయితే ఫస్ట్ లిస్ట్ లో పలువురు టీడీపీ నేతల పేర్లు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. 

గంటా శ్రీనివాసరావు, యరపతినేని శ్రీనివాసరావు, ఆనం రామనారాయణరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పీతల సుజాత, కళా వెంకట్రావ్, చింతమనేని ప్రభాకర్, దేవినేని ఉమా, ఆలపాటి రాజా తదితరుల పేర్లు తొలి జాబితాలో కనిపించలేదు. తమ పేర్లు లేకపోవడంతో వీరంతా అసహనానికి గురవుతున్నారు. అయితే, పొత్తుల నేపథ్యంలో వీరి పేర్లను ప్రకటించడం ఆలస్యం అవుతోంది. బీజేపీతో క్లారిటీ వచ్చిన తర్వాత వీరి పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. వీరంతా రెండో జాబితాపై ఆశలు పెట్టుకున్నారు.

  • Loading...

More Telugu News