Wedding Reception: దిల్ రాజు సోదరుడి కుమారుడి పెళ్లి రిసెప్షన్ లో తారా తోరణం

Tollywood bigwigs rushed to Ashish and Advaita wedding reception
  • ఫిబ్రవరి 14న నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ వివాహం
  • రాజస్థాన్ లోని జైపూర్ లో అద్వైతతో డెస్టినేషన్ వెడ్డింగ్
  • నేడు మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో గ్రాండ్ గా రిసెప్షన్ 

ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ వివాహం అద్వైతతో ఫిబ్రవరి 14న ఘనంగా జరిగింది. రాజస్థాన్ లోని జైపూర్ లో వీరి పెళ్లి జరిగింది. ఆశిష్-అద్వైతల పెళ్లి రిసెప్షన్ నేడు హైదరాబాదులో గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ వేదిక. ఈ రిసెప్షన్ కు టాలీవుడ్ అగ్రశ్రేణి ప్రముఖులు, ఇతర రంగాలకు చెందిన ముఖ్యులు తరలివచ్చారు. రామ్ చరణ్, దక్షిణాది స్టార్ డైరెక్టర్ శంకర్, నాగార్జున, నాగచైతన్య, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, హరీశ్ శంకర్, సుకుమార్, నందమూరి కల్యాణ్ రామ్, యువ హీరోలు రామ్, నితిన్, కిరణ్ అబ్బవరం, మురళీశర్మ, సీనియర్ నటుడు శ్రీకాంత్, రోషన్ మేకా తదితరులు విచ్చేశారు.

  • Loading...

More Telugu News