Lasya Nanditha: లాస్య నందిత అంతిమయాత్రలో పాడె మోసిన హరీశ్ రావు

Harish Rao participates in Lasya Nandita funeral procession
  • రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన ఎమ్మెల్యే లాస్య నందిత
  • గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి
  • కార్ఖానాలోని నివాసం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర
  • ఈస్ట్ మారేడ్ పల్లి శ్మశాన వాటికలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
రోడ్డు ప్రమాదంలో మరణించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అంతిమ యాత్ర ప్రారంభమైంది. గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం ఆమె భౌతిక కాయాన్ని కార్ఖానాలోని నివాసానికి తరలించారు. ఈస్ట్ మారేడ్ పల్లిలోని శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

కాగా, లాస్య నందిత అంతిమయాత్రలో బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కౌశిక్ రెడ్డి బాధాతప్త హృదయాలతో పాల్గొన్నారు. తమ పార్టీ సహచరురాలి పాడె మోశారు. దీనికి సంబంధించిన వీడియోను బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది. కాగా, లాస్య నందిత అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు.
Lasya Nanditha
Harish Rao
Funeral
Hyderabad
BRS
Road Accident

More Telugu News