YS Sharmila: ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ఉన్న ఒత్తిడిని అర్థం చేసుకోగలను: వైఎస్‌ షర్మిల

I can understand the pressure on Alla Ramakrishna Reddy says YS Sharmila
  • ఇటీవల మళ్లీ వైసీపీలో చేరిన ఆర్కే
  • ఆర్కే తన సొంత మనిషన్న షర్మిల
  • రైట్ పర్సన్ ఇన్ రాంగ్ ప్లేస్ అని వ్యాఖ్య
ఎమ్మెల్యే పదవికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి... రోజుల వ్యవధిలోనే మళ్లీ సొంత గూటికి చేరుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన మళ్లీ వైసీపీలో చేరారు. ఈ నేపథ్యంలో, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతూ... ఆళ్ల రామకృష్ణారెడ్డి తనకు సొంత మనిషని చెప్పారు. ఆయనపై ఎంత ఒత్తిడి ఉందో తాను అర్థం చేసుకోగలనని అన్నారు. ఒక చెల్లెలుగా ఆర్కేను అర్థం చేసుకుంటానని... ఆయన ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఒక మంచి వ్యక్తి రాంగ్ ప్లేస్ లో ఉన్నారని అన్నారు. తనకు, ఆర్కేకు మధ్య రాజకీయాలు లేవని అన్నారు.
YS Sharmila
Congress
Alla Ramakrishna Reddy
YSRCP
AP Politics

More Telugu News