Upasana: ఆలస్యంగా పిల్లలను కనాలకున్నాను... అందులో తప్పేముంది?: ఉపాసన

  • ఎండో మార్చ్ ఈవెంట్ లో పాల్గొన్న ఉపాసన
  • తొలి బిడ్డను కనేందుకు ఎక్కువ గ్యాప్ తీసుకోవడంపై స్పందన
  • తనకు ఏది కావాలో నిర్ణయించుకునే హక్కు స్త్రీకి ఉందన్న ఉపాసన
  • రెండో బిడ్డను కనేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడి
Upasana talks about motherhood

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులు గతేడాది జూన్ 20న తల్లిదండ్రులయిన సంగతి తెలిసిందే. ఉపాసన పండంటి పాపాయికి జన్మనివ్వగా, ఆ చిన్నారికి క్లీంకార అని నామకరణం చేశారు. రామ్ చరణ్, ఉపాసన 2012లో పెళ్లి చేసుకున్నారు. 11 ఏళ్ల విరామం తర్వాత తొలి బిడ్డకు జన్మనిచ్చారు. తొలి బిడ్డను కనేందుకు అంత సమయం తీసుకోవడం పట్ల ఉపాసన ఓ ఈవెంట్ లో స్పందించారు. 

మహిళల ఆరోగ్యంపై హైదరాబాద్ లో నిర్వహించిన ఎండో మార్చ్ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాసన మాట్లాడుతూ.... తనకు ఏది కావాలో అది నిర్ణయించుకునే హక్కు స్త్రీకి ఉందని స్పష్టం చేశారు. 

ఆలస్యంగా తల్లిని కావాలనుకున్నాను... అందుకు తగ్గట్టుగా ప్రణాళిక రూపొందించుకున్నాను అని వివరించారు. ఎప్పుడు తల్లి కావాలన్నది తన నిర్ణయం అని, అందులో తప్పేమీ లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు రెండో సంతానం కోసం తాను సిద్ధంగా ఉన్నానని ఉపాసన వెల్లడించారు.

More Telugu News