Sachin Tendulkar: కశ్మీర్ రోడ్డుపై స్థానికులతో కలిసి క్రికెట్ ఆడిన సచిన్

Sachin Tendulkar spotted playing gully cricket in Kashmir Gulmarg
  • జమ్మూ కశ్మీర్ లో పర్యటిస్తున్న సచిన్ 
  • గుల్మార్గ్ లో గల్లీ క్రికెట్ ఆడిన టెండూల్కర్ 
  • వీడియోను షేర్ చేసిన వైనం
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ జమ్మూకశ్మీర్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. సచిన్ తొలిసారి కశ్మీర్ ట్రిప్ కు వెళ్లారు. ఈ సందర్భంగా గుల్మార్గ్ లోని రోడ్డుపై స్థానికులతో కలిసి ఆయన కాసేపు క్రికెట్ ఆడారు. సచిన్ వాహనంలో వెళ్తుండగా... ఒక వీధిలోని రోడ్డుపై కొందరు క్రికెట్ ఆడుతూ కనిపించారు. వారి వద్దకు వెళ్లిన సచిన్ నేనూ ఆడనా? అని అడిగారు. ఆ తర్వాత బ్యాట్ పట్టి కొన్ని బంతులు ఆడారు. దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్ వేదికగా సచిన్ షేర్ చేశారు. 'స్వర్గంలో ఒక మ్యాచ్' అని వీడియోకు క్యాప్షన్ పెట్టారు.
Sachin Tendulkar
Jammu And Kashmir
Gulmarg
Gully Cricket

More Telugu News