Hit And Run: కారుతో తోపుడు బండిని ఢీకొట్టి పరారయ్యే యత్నం.. పట్టుకున్న స్థానికులు.. బాధితుడిని ఆసుపత్రిలో చేర్చి పరారైన వైద్యుడు

Hit and Run case in Hyderabad Attapur doctor on run
  • అత్తాపూర్‌లో ఈ తెల్లవారుజామున ఘటన
  • వైద్యుడిని వెంటాడి పట్టుకున్న స్థానికులు
  • తీవ్రంగా గాయపడిన వ్యక్తికి తన ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తానని చెప్పి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి పరారీ
  • విషమంగా బాధితుడి పరిస్థితి
హైదరాబాద్‌లో మరో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. ఈ తెల్లవారుజామున బొల్లారంలో ఓ వైద్యుడు కారులో వేగంగా వెళ్తూ అదుపుతప్పి తోపుడు బండ్లను ఢీకొట్టి పారిపోయే ప్రయత్నం చేశాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు కారును వెంబడించి వైద్యుడిని పట్టుకున్నారు.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సయ్యద్ పాషాకు తన ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తానని చెప్పిన వైద్యుడు కారులో అతడిని తీసుకెళ్లాడు. అత్తాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పాషాను చేర్చి అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడైన వైద్యుడు నగరంలోని ఓ ఆసుపత్రిలో న్యూరోసర్జన్ అని తెలుస్తోంది. 

తీవ్రంగా గాయపడిన పాషా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆసుపత్రి బిల్లులు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నట్టు చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. పరారీలో ఉన్న వైద్యుడిని పట్టుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
Hit And Run
Hyderabad
Doctor
Attapur

More Telugu News