Thanikella Bharani: నా జీవితంలో అతిపెద్ద విషాదం అదే: తనికెళ్ల భరణి

Thanikella Bharani Interview
  • మిత్రుడు దేవరకొండ నరసింహకుమార్ మరణం అత్యంత విషాదకరమన్న భరణి  
  • తనలో రచయిత ఉన్నాడనే విషయాన్ని ముందుగా గ్రహించింది తనేనని వెల్లడి   
  • వాడి మరణం నుంచి కోలుకోవడానికి కొన్నేళ్లు పట్టిందని వ్యాఖ్య   

రచయితగా .. నటుడిగా .. దర్శకుడిగా తనికెళ్ల భరణికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అలాంటి ఆయన 'ట్రీ మీడియా'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. రచయితగా ... నటుడిగా నాటకరంగం నుంచి కొనసాగిన తన ప్రస్థానం గురించి వివరించారు. తనకి ఎన్నో అవార్డులు వచ్చినప్పటికీ, 'శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి' పేరుతో వచ్చిన అవార్డు ఎంతో ఇష్టమని చెప్పారు.

"నా జీవితంలో అత్యంత విషాదకరమైన సంఘటన ఒకటి జరిగింది .. అది నా స్నేహితుడి మరణం. 50 ఏళ్ల క్రితం జరిగిన ఆ సంఘటన ఇప్పటికీ నన్ను బాధపెడుతూనే ఉంటుంది. నా మిత్రుడు దేవరకొండ నరసింహ కుమార్ అని ఉండేవాడు. డిగ్రీ వరకూ ఇద్దరం కలిసే చదువుకున్నాం. తనకి నా కంటే ముందుగానే ఉద్యోగం వచ్చింది .. మంచి తెలివైనవాడు. అలాంటివాడు ఓ ప్రమాదంలో చనిపోయాడు' అని అన్నారు.

" నాలో ఒక రచయిత ఉన్నాడనే విషయాన్ని ముందుగా గ్రహించింది తనే. నన్ను ప్రోత్సహించి రాయిస్తూ ఉండేవాడు. నేను వ్రాసింది చదివి చాలా బాగుందని చెప్పి ఎంకరేజ్ చేసేవాడు. నేను బాగా రాయగలను అనే ఒక నమ్మకాన్ని నాకు కలిగించి ఆ రూట్లో నేను ముందుకు వెళ్లడానికి కారణమే వాడు. అలాంటి మిత్రుడిని కోల్పోయిన నాకు, కోలుకోవడానికి కొన్నేళ్లు పట్టింది" అని చెప్పారు.

  • Loading...

More Telugu News