Jawahar: జగన్ కు లండన్ లో కూడా ప్యాలెస్ ఉంది.. ఆర్కే నాటకాలు కొనసాగుతున్నాయి: మాజీ మంత్రి జవహర్‌

Jagan has palace in London says Jawahar
  • ఇద్దరి కోసం జగన్ ఆరు ఇళ్లు నిర్మించుకుంటున్నారన్న జవహర్
  • అన్ని విషయాల్లో జగన్ గందరగోళంలో ఉన్నారని ఎద్దేవా
  • కాంగ్రెస్ లో చేరిన ఆర్కే మళ్లీ వైసీపీలోకి ఎందుకు వచ్చారని ప్రశ్న

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జవహర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో నిజమైన పెత్తందారుడు జగనే అని ఆయన అన్నారు. జగన్ కు హైదరాబాద్ లో లోటస్ పాండ్ తో పాటు బెంగళూరు, పులివెందుల, ఇడుపులపాయ, కడపలో ఖరీదైన నివాసాలు ఉన్నాయని... విలాసవంతమైన జీవితం గడిపేందుకు లండన్ లో కూడా ఓ ప్యాలెస్ ను నిర్మించుకున్నారని చెప్పారు. ఇద్దరు ఉండటం కోసం ఆరు విలాసవంతమైన ఇళ్లు కట్టుకున్నారని దుయ్యబట్టారు. 

కేవలం టికెట్ల విషయంలోనే కాకుండా... ప్రతి విషయంలోనూ జగన్ గందరగోళంలో ఉన్నారని జవహర్ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో వైసీపీ తరపున ఎవరు పోటీ చేస్తారనే దానిపై కూడా జగన్ కు స్పష్టత లేదని చెప్పారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నాటకాలు ఇంకా కొనసాగుతున్నాయని అన్నారు. షర్మిల వద్దకు వెళ్లడం... తిరిగి వైసీపీలోకి రావడం ఓ డ్రామా అని విమర్శించారు. కాంగ్రెస్ లోకి ఎందుకు వెళ్లినట్టు, మళ్లీ వైసీపీలోకి ఎందుకు వచ్చినట్టని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News