Balakrishna: మరో యంగ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన బాలయ్య!

Balakrishna in Rahul Sankrityayan Movie
  • బాబీ సినిమాతో బిజీగా ఉన్న బాలయ్య
  • త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న 'అఖండ' సీక్వెల్ 
  • నెక్స్ట్ ప్రాజెక్టు డైరెక్టర్ గా రాహుల్ సాంకృత్యాయన్ పేరు 
  • 'శ్యామ్ సింగరాయ్' సినిమాతో హిట్ కొట్టిన డైరెక్టర్   

సీనియర్ స్టార్ హీరోలలో బాలకృష్ణ భారీ విజయాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన తన 109వ సినిమా షూటింగులో ఉన్నారు. బాబీ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా తరువాత ఆయన 'అఖండ' సీక్వెల్ కోసం బోయపాటితో సెట్స్ పైకి వెళ్లనున్నారని అంటున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులలోనే బోయపాటి ఉన్నారు.

అనిల్ రావిపూడి వంటి యంగ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన బాలకృష్ణ, తన కెరియర్ లోనే అత్యధిక వసూళ్లను చూశారు. అలాగే ఇప్పుడు ఆయన మరో యువ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చినట్టుగా ఒక వార్త బలంగా వినిపిస్తోంది. ఆ యువ దర్శకుడి పేరే రాహుల్ సాంకృత్యాయన్ . 'శ్యామ్ సింగరాయ్' సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నవాడాయన. 

రాహుల్ రీసెంటుగా బాలయ్యను కలిసి కథ చెప్పాడనీ, బాలయ్య వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. భారీ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చినట్టుగా సమాచారం. 'అఖండ 2' తరువాత బాలయ్య చేయనున్న సినిమా ఇదేనని అంటున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి. 
Balakrishna
Boyapati Sreenu
Akhanda 2
Rahul Sankrityayan

More Telugu News