Dharmana Prasada Rao: ఈ ఘనత జగన్ కు మాత్రమే దక్కుతుంది: ధర్మాన ప్రసాదరావు

Dharmana Prasad Rao praises Jagan
  • కరోనా సమయంలో కూడా ఇబ్బందులు లేకుండా చూసుకున్న ఘనత జగన్ ది అన్న ధర్మాన
  • అధికారం కోసం అడ్డదారులు తొక్కడం చంద్రబాబు నైజమని వ్యాఖ్య
  • రాష్ట్రాన్ని జగన్ అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని కితాబు

కరోనా మహమ్మారి పంజా విసురుతున్న సమయంలో కూడా ప్రజలకు ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు లేకుండా చూసుకున్న ఘనత ముఖ్యమంత్రి జగన్ కే దక్కుతుందని మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశంసించారు. ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని అంశాలను ఆచరణలో పెట్టిన ఘనత జగన్ దని కొనియాడారు. ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కడం చంద్రబాబుకు అలవాటేనని చెప్పారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు సొంత ఆస్తులు కూడబెట్టుకోవడం తప్ప, రాష్ట్రానికి చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత జగన్ దని కితాబునిచ్చారు. 

14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబుకు ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ప్రజలు కనిపించలేదా? అని ప్రశ్నించారు. కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్న ప్రజలకు ధైర్యం చెప్పిన ఘనత జగన్ దేనని చెప్పారు. చంద్రబాబు అబద్ధపు హామీలు ఇచ్చి మరోసారి అధికారంలోకి రావాలనుకుంటున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News