Revanth Reddy: ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy reaches New Delhi
  • బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి రేవంత్ రెడ్డి
  • సీఎంతో పాటు వెళ్లిన భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు
  • లోక్ సభ ఎన్నికలు, మంత్రివర్గ విస్తరణ ఊహాగానాల నేపథ్యంలో ప్రాధాన్యత
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. సోమవారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. ముఖ్యమంత్రితో పాటు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికలు, తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ ఊహాగానాల నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక పలుమార్లు ఢిల్లీకి వెళ్ళారు. విభజన హామీల కోసం గతంలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులను కలిశారు. అలాగే పార్టీ వ్యవహారాలకు సంబంధించి ఏఐసీసీ అగ్రనేతలను కలిశారు.
Revanth Reddy
Congress
New Delhi

More Telugu News