Andhra Jyothy Photographer: ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ పై దాడికి పాల్పడిన వారిని గుర్తించాం: ఎస్పీ అన్బురాజన్

SP Anburajan said police identify who attacked on Andhra Jyothy photographer
  • రాప్తాడులో సీఎం జగన్ సిద్ధం సభ
  • ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడి
  • దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేశామన్న ఎస్పీ

ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడులో నిన్న సిద్ధం సభ సందర్భంగా ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణపై విచక్షణ రహితంగా దాడి జరిగింది. ఈ ఘటనపై ఎస్పీ అన్బురాజన్ స్పందించారు. ఆంధ్రజ్యోతి పత్రికా ఫొటోగ్రాఫర్ పై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేశామని వెల్లడించారు. దాడికి పాల్పడినవారిని గుర్తించామని తెలిపారు. 

ఈ ఘటనలో పోలీసులపైనా ఆరోపణలు వచ్చాయని, అదనపు ఎస్పీ స్థాయి అధికారితో విచారణ చేపడుతున్నామని అన్బురాజన్ పేర్కొన్నారు. ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం ఉందని తేలితే వారిపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. 

మీడియా ప్రతినిధుల రక్షణ తమ బాధ్యత అని ఎస్పీ ఉద్ఘాటించారు. మీపై దాడులకు పాల్పడినా, బెదిరించినా మాకు ఫిర్యాదు చేయండి అంటూ పాత్రికేయులకు సూచించారు. జర్నలిస్టులు స్వేచ్ఛాయుత వాతావరణంలో విధులు నిర్వర్తించుకునేందుకు తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

  • Loading...

More Telugu News