Ponnam Prabhakar: రానున్న రోజుల్లో డబుల్ ఇంజిన్ సర్కార్‌ను ఏర్పాటు చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

Minister Ponnam Prabhakar says Congress will win Centre also
  • ఆరు గ్యారెంటీలనూ అమలు చేస్తామన్న పొన్నం 
  • సమ్మక్క, సారలమ్మ జాతరకు ఆరువేల బస్సులు కేటాయించామన్న మంత్రి
  • అందుకే గ్రామాలలో ఈ నెల 25వ తేదీ వరకు బస్సుల కొరత ఉంటుందని వెల్లడి

రానున్న రోజుల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు చేస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో నేడు ఆయన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ... ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలనూ తాము అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే అధికారంలోకి వచ్చామని, రానున్న రోజుల్లో కేంద్రంలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ, శివాజీల ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సమ్మక్క, సారలమ్మ జాతరకు ఆరువేల బస్సులు కేటాయించినట్లు చెప్పారు. అందుకే గ్రామాలలో ఈ నెల 25వ తేదీ వరకు బస్సుల కొరత ఉంటుందని తెలిపారు. తాను లోక్ సభ సభ్యుడిగా ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధి నేటికీ కనిపిస్తోందన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను కోరారు.

  • Loading...

More Telugu News