Nadendla Manohar: వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడితే.. పవన్ పై కేసు నమోదు చేస్తారా?: నాదెండ్ల మనోహర్

Nadendla Manohar on case filed against Pawan Kalyan
  • ఇళ్లకు వెళ్లి సమాచారం సేకరించాలని వాలంటీర్లకు ఎవరు చెప్పారన్న నాదెండ్ల
  • సమాచారాన్ని ఎక్కడ భద్రపరుస్తున్నారని ప్రశ్న
  • తమ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం లేదని మండిపాటు
ఏపీలో ఉన్న వాలంటీర్ వ్యవస్థపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శలు గుప్పించారు. ఇంటింటికీ వెళ్లి పూర్తి సమాచారాన్ని సేకరించాలని వాలంటీర్లకు ఎవరు చెప్పారని ప్రశ్నించారు. వాలంటీర్లు సేకరించిన సమాచారాన్ని ఎక్కడ భద్రపరుస్తున్నారని అడిగారు. వాలంటీర్ వ్యవస్థ గురించి అడిగితే పవన్ కల్యాణ్ పై కేసు పెడతారా? అని మండిపడ్డారు. పవన్ పై వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టిందని విమర్శించారు. తాము అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా.... మంత్రులు, పోలీసులు ఎదురుదాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు వాలంటీర్ వ్యవస్థకు చట్టపరమైన గుర్తింపు ఉందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యపై సీఎం జగన్ ఎప్పుడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. 

Nadendla Manohar
Pawan Kalyan
Janasena
Volunteers
Jagan
YSRCP

More Telugu News