Chiranjeevi: అమెరికాలో చిరంజీవికి ఘన సన్మానం

Mega fans in USA felicitated Chiranjeevi in a grand style
  • ఇటీవల చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించిన కేంద్రం
  • లాస్ ఏంజెల్స్ నగరంలో చిరంజీవికి సన్మాన కార్యక్రమం
  • అభిమానుల కోలాహలం చూసి ముగ్ధుడైన మెగాస్టార్ 

అమెరికా పర్యటనలో ఉన్న మెగాస్టార్ చిరంజీవిని అక్కడి అభిమానులు ఘనంగా సన్మానించారు. చిరంజీవికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం భారతదేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ ప్రకటించిన నేపథ్యంలో... అమెరికాలోని మెగా ఫ్యాన్స్ లాస్ ఏంజెల్స్ నగరంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. 

ఇక్కడి రిట్జ్ కార్ల్ టన్ డ్రైవ్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అమెరికాలోని చిరు అభిమానులు భారీగా తరలివచ్చారు. అమెరికా గడ్డపై తన అభిమానులను చిరంజీవి ముగ్ధులయ్యారు. ఈ సత్కారం సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, తనకు వచ్చిన అవార్డును చూసి అభిమానులు అది తమకే వచ్చినంతగా సంబరపడుతున్నారని తెలిపారు. 

అవార్డు వచ్చినప్పుడు, గుర్తింపు లభించినప్పుడు నిజంగా ఆనందమేనని, అయితే, తనకు అవార్డు రావడం పట్ల ఇంత మంది ప్రతిస్పందిస్తుండడం చూసి తనకెంతో సంతోషంగా అనిపిస్తోందని చిరంజీవి పేర్కొన్నారు. ఇంతమంది తమ ఉత్సాహాన్ని వ్యక్తపరుస్తుంటే ఇది కదా నిజమైన ఆనందం అనిపిస్తోందని అన్నారు. ఇంతకంటే అవార్డు ఇంకేముంటుందని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News