AP DSC: సుప్రీంకోర్టు నిబంధనలు అమలు కావాలి కదా?: ఏపీ ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించిన హైకోర్టు

Hearing on AP DSC in AP High Court
  • డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టులో పిటిషన్
  • బీఈడీ అభ్యర్థులకు అనుమతిని ఇవ్వడం వల్ల డీఎడ్ అభ్యర్థులు నష్టపోతారన్న పిటిషనర్
  • సుప్రీం నిబంధనలకు విరుద్ధంగా ఖాళీల భర్తీ చేపట్టారని అభ్యంతరం
ఏపీ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ పై రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించడంపై పిటిషన్ వేశారు. ఇది సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమని పిటిషన్ లో పిటిషనర్ పేర్కొన్నారు. బీఈడీ అభ్యర్థులకు అనుమతిని ఇవ్వడం వల్ల డీఎడ్ అభ్యర్థులు నష్టపోతారని తెలిపారు. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ఖాళీల భర్తీ చేపట్టారని అన్నారు. పిటిషన్ ను విచారించిన హైకోర్టు... సుప్రీంకోర్టు నిబంధనలు అమలు కావాలి కదా? అని ప్రభుత్వ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. 

AP DSC
AP High Court

More Telugu News