OnePlus 12R: వన్‌ప్లస్ 12ఆర్ కొన్నవారికి పూర్తి డబ్బులు వెనక్కి.. మార్చి 16 వరకు మాత్రమే అవకాశం!

OnePlus Announce Full Refund To Customers Who Buy OnePlus 12R
  • వన్‌ప్లస్ 12ఆర్‌ను పొరపాటుగా యూఎఫ్ఎస్ 4.0గా లిస్ట్ చేసిన కంపెనీ
  • నిజానికి అది బేస్ స్టోరేజీ ఆప్షన్‌కు సమానమైన యూఎఫ్ఎస్ 3.1తో తీసుకొచ్చిన కంపెనీ
  • అధిక ధర చెల్లించి కొనుగోలు చేసిన వినియోగదారులకు పూర్తి రిఫండ్ ఇవ్వనున్నట్టు కంపెనీ ప్రకటన
వన్‌ప్లస్ 12ఆర్‌ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు పూర్తి రిఫండ్ చెల్లించనున్నట్టు వన్‌ప్లస్ ప్రకటించింది. మార్చి 16 వరకు ఇది అందుబాటులో ఉంటుందని తెలిపింది. కంపెనీ ఇలా రిఫండ్ ప్రకటించడం వెనక కారణం ఉంది. నిజానికి ఈ స్మార్ట్‌ఫోన్ యూఎఫ్ఎస్ 3.1 కాగా, దానిని పొరపాటున యూఎఫ్ఎస్ 4.0గా లిస్ట్ చేసింది. యూఎఫ్ఎస్ 3.1 అనేది బేస్ స్టోరేజీ ఆప్షన్‌తో సమానం. ఈ నేపథ్యంలో అధిక ధర చెల్లించి ఫోన్‌ను కొనుగోలు చేసిన వారికి రిఫండ్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఫోన్‌ను వన్‌ప్లస్ 12 మోడల్‌తోపాటు వన్‌ప్లస్ 12ఆర్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8వ జనరేషన్ సెకండ్ చిప్‌సెట్, 16 జీబీ ర్యామ్, 256 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజీ ఉంది. 

ఫోన్‌ను పొరపాటుగా లిస్ట్ చేయడంపై వన్‌ప్లస్ ప్రెసిడెంట్, సీవోవో కిండెర్ లియు ఓ ప్రకటన చేస్తూ.. వన్‌ప్లస్ 12ఆర్ 256 స్టోరేజీ వేరియంట్ కొనుగోలు చేసిన వినియోగదారులు మార్చి 16 వరకు రిఫండ్ పొందొచ్చని తెలిపారు. 

వన్‌ప్లస్ 12ఆర్ స్పెసిఫికేషన్లు: ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్, 6.78 అంగుళాల ఎల్‌టీపీవో 4.0 అమోలెడ్ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్, అండర్ ద హుడ్, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్, 16 జీబీ ర్యామ్, 256 జీబీతో యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్. 50 మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్‌తో వెనకవైపు మూడు కెమెరాలు, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.
OnePlus 12R
OnePlus 12
UFS 3.1
China
Smart Phone
Gadgets
Refund

More Telugu News