Suman: సీట్ల సర్దుబాటు సక్రమంగా జరిగితే టీడీపీ-జనసేన విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు: సుమన్

Suman says TDP and Janasena alliance surely win AP Elections
  • తిరుపతి విచ్చేసిన నటుడు సుమన్
  • గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు
  • ఏపీ ఓటర్లు ప్రలోభాలకు గురికావొద్దని సూచన
  • చంద్రబాబు పరిపాలన అనుభవం ఉన్న వ్యక్తి అని కితాబు
టాలీవుడ్ సీనియర్ నటుడు సుమన్ తిరుపతి తాతయ్యగుంటలోని గంగమ్మ ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ ఏపీ రాజకీయాలపై స్పందించారు. 

సీట్ల సర్దుబాటు ప్రక్రియ సక్రమంగా జరిగితే ఏపీలో టీడీపీ-జనసేన కూటమి విజయాన్ని ఎవరూ ఆపలేరని సుమన్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు పరిపాలన గురించి బాగా అనుభవం ఉన్న వ్యక్తి అని, ఏపీ ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా ఎన్నికల్లో జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

అంతేకాదు, చంద్రబాబు రాజకీయాల్లో తనకు గురువు అని సుమన్ తెలిపారు. బాపట్ల ఎంపీగా పోటీ చేయాలని చంద్రబాబు తనకు అవకాశం ఇచ్చారని, కానీ తాను ఎన్నికల్లో పోటీచేసేందుకు ఇష్టపడలేదని వెల్లడించారు. నాపై నమ్మకంతో చంద్రబాబు అవకాశం ఇవ్వాలనుకున్నారు... అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని సుమన్ వివరించారు.
Suman
Chandrababu
TDP
Janasena
Andhra Pradesh

More Telugu News