Mallu Bhatti Vikramarka: త్వరలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Bhatti Vikramarka says loans for no interest to self help groups soon
  • భద్రాచలం వచ్చిన మల్లు భట్టి విక్రమార్క
  • మహిళా సంఘాలకు శుభవార్త చెప్పిన డిప్యూటీ సీఎం
  • కాంగ్రెస్ పాలనలో మహిళలను మహాలక్ష్మిగా చూసుకుంటామని వెల్లడి

తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. కాంగ్రెస్ పాలనలో మహిళలను మహాలక్ష్మిగా చూసుకుంటామని తెలిపారు. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని అన్నారు. జీతాలు సకాలంలో అందని ఆశా వర్కర్లు, అంగన్ వాడీ సిబ్బందికి జీతాలకు ఇబ్బంది లేకుండా చేస్తామని భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ పథకాలతో ఇందిరమ్మ రాజ్యాన్ని సాకారం చేస్తామని పేర్కొన్నారు. ఇవాళ భద్రాచలం వచ్చిన భట్టి విక్రమార్క ఈ మేరకు ప్రకటన చేశారు.

  • Loading...

More Telugu News