Devineni Uma: జగన్ సభకు ఇలా ప్లాన్ చేశారన్న మాట!: దేవినేని ఉమా

Devineni Uma shares a video of YCP supporters going to Raptadu Siddham meeting
  • రాప్తాడులో నేడు సీఎం జగన్ సిద్ధం సభ
  • బస్సుల్లో జనాల తరలింపు
  • ఓ బస్సులో కొందరు మందు సీసాలు, ఉడకబెట్టిన కోడిగుడ్లతో కనిపించిన వైనం
  • వీడియో పంచుకున్న దేవినేని ఉమా, టీడీపీ

సీఎం జగన్ ఇవాళ రాప్తాడులో వైసీపీ సిద్ధం సభ నిర్వహించారు. దీనిపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా సోషల్ మీడియాలో ఓ వీడియో పంచుకున్నారు. అందులో రాప్తాడు సిద్ధం సభకు వెళుతున్న ఓ బస్సులో కొందరు మద్యం సీసాలు, ఉడకబెట్టిన కోడిగుడ్లతో కనిపించారు. దేవినేని ఉమా ఆ వీడియోపై స్పందిస్తూ... జగన్ సభ పేరు చెబితే ప్రజలు ముఖం చాటేస్తుండడంతో ఇలా ప్లాన్ చేశారన్న మాట అని వ్యాఖ్యానించారు. 

తెలుగుదేశం పార్టీ కూడా తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఇదే వీడియోను పంచుకుంది. శ్రాద్ధం సభకు మద్యం పోస్తే కానీ జనాలు రావడంలేదని వ్యంగ్యం ప్రదర్శించింది. మళ్లీ మందులోకి స్టఫ్ గా గుడ్డు అంటూ ఎత్తిపొడిచింది. "మద్య నిషేధం చేసి ఎన్నికలకు ఓట్లు అడగడం అంటే ఇదే... నకిలీ బతుకులు, నంగనాచి వేషాలు.. థు.. " అంటూ టీడీపీ ధ్వజమెత్తింది.

  • Loading...

More Telugu News