Andela Sriramulu: బీజేపీ తెలంగాణ నేత ఇంట్లో ఐటీ రైడ్స్

IT Raids at BJP Leader Andela Sriramulu residence
  • అందెల శ్రీరాములు నివాసంలో, పీఏ ఇంట్లోనూ తనిఖీలు
  • శ్రీరాములు బిజినెస్ పార్ట్ నర్ నివాసంలో కూడా రైడ్స్
  • ఉదయం నుంచి సోదాలు చేస్తున్న అధికారులు

బీజేపీ తెలంగాణ నేత అందెల శ్రీరాములు నివాసంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున మహేశ్వరం నుంచి శ్రీరాములు పోటీ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతిలో 26 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. శ్రీరాములు పర్సనల్ అసిస్టెంట్ నివాసంతో పాటు శ్రీరాములు బిజినెస్ పార్ట్ నర్ ప్రతిమా రెడ్డి ఇంట్లో కూడా ఐటీ రైడ్ జరుగుతోంది. పోలీస్ సిబ్బంది సాయంతో వారి ఇళ్లకు చేరుకున్న ఐటీ అధికారులు.. ఉదయం నుంచి సోదాలు జరుపుతున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News