నా జీవనరేఖ, నా సౌభాగ్య రేఖ అంటూ సురేఖకు బర్త్ డే విషెస్ చెప్పిన మెగాస్టార్
- నేడు సురేఖ బర్త్ డే
- ప్రస్తుతం అమెరికాలో హాలీడేలో చిరు, సురేఖ
- ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్ష
చిరంజీవి ప్రస్తుతం సురేఖతో కలిసి విదేశాల్లో ఉన్నారు. విశ్వంభర షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్న చిరంజీవి అర్ధాంగితో కలిసి యూఎస్ వెళ్లారు. ఈ విషయాన్ని చిరు స్వయంగా వెల్లడించారు. హాలీడే కోసం యూఎస్ వెళ్తున్నామని, వచ్చాక తిరిగి విశ్వంభర సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని చెబుతూ సురేఖతో విమానంలో దిగిన సెల్ఫీని షేర్ చేశారు.