చంద్రబాబుకు నాని తీరని ద్రోహం చేశారు: కేశినేని చిన్ని
- చంద్రబాబు అక్రమ అరెస్ట్ వ్యవహారంలో నాని కోవర్టుగా పనిచేశారన్న చిన్ని
- బాబు అరెస్ట్ సమయంలో లోకేశ్ ఎవరెవరిని కలిశారన్న విషయాలను జగన్‌కు చేరవేశారని ఆగ్రహం
- ఎన్నికల తర్వాత నాని ప్రజా జీవితంలో ఉండరని జోస్యం
ఎన్టీఆర్ జిల్లాలో టికెట్లు ఇప్పిస్తానని పలువురి నుంచి నాని కోట్ల రూపాయలు వసూలు చేశారని, వాటిని తిరిగి ఇవ్వకపోతే బాగుండదని హెచ్చరించారు. మైలవరం టికెట్ ఇప్పిస్తానని మరో ఇద్దరి నుంచి కూడా డబ్బులు వసూలు చేశారని, ప్రాణ స్నేహితుడి వద్ద కూడా డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వడం లేదని ఆరోపించారు. విజయవాడ ఎంపీగా టీడీపీలో ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి ఇప్పుడు వైసీపీలో జగన్ పాలేరుగా మారారని ఎద్దేవా చేశారు. తనను పిట్టల దొర అన్న నాని పరిస్థితి ఏంటో ఎన్నికల తర్వాత తేలిపోతుందని చెప్పారు. వైసీపీ ఆయనకు విజయవాడ సీటు కూడా ఇవ్వదన్నారు. ఎన్నికల తర్వాత కేశినేని నాని అనే వ్యక్తి ప్రజా జీవితంలో ఉండరని జోస్యం చెప్పారు.