Suhani Bhatnagar: 19 ఏళ్ల వయసుకే మృతి చెందిన 'దంగల్' బాలనటి

Dangal child artist Suhani Bhatnagar died
  • దంగల్ చిత్రంలో చిన్నప్పటి బబితగా నటించిన సుహానీ భట్నాగర్
  • శనివారం ఉదయం కన్నుమూత
  • మృతికి గల కారణాలపై స్పష్టత లేని వైనం

కుస్తీ యోధుడు మహావీర్ ఫోగాట్, ఆయన కుమార్తెలు గీతా ఫోగాట్, బబితా ఫోగాట్ ల జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం దంగల్. ఇందులో అమీర్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించారు. అయితే, ఇందులో అమీర్ ఖాన్ కుమార్తె బబిత చిన్నప్పటి పాత్ర పోషించిన సుహానీ భట్నాగర్ కన్నుమూసింది. 

ఆమె వయసు ప్రస్తుతం 19 సంవత్సరాలు. ఈ ఉదయం ఆమె తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తోంది. సుహానీ భట్నాగర్ మృతికి గల కారణాలు తెలియరాలేదు. సుహానీ ఢిల్లీ శివారు ఫరీదాబాద్ లోని సెక్టార్-17లో నివాసం ఉంటోంది.  ఆమె అంత్యక్రియలు అజ్రోండా శ్మశాన వాటికలో నిర్వహించనున్నారు.

  • Loading...

More Telugu News