Jersey City Fire Accident: అమెరికాలో భారతీయులున్న భవనంలో అగ్నిప్రమాదం!

 India extends support to those impacted by residential building fire in New Jersey
  • న్యూజెర్సీ రాష్ట్రంలోని జెర్సీ నగరంలోగల భవనంలో ఘటన
  • భారత్‌కు చెందిన 11 మంది విద్యార్థులు, మరో జంట భవనంలో నివాసం
  • భారతీయులందరూ క్షేమంగా ఉన్నారని భారత ఎంబసీ ప్రకటన
  • వారందరికీ అవసరమైన సహాయసహకారాలు అందిస్తున్నామని వెల్లడి
అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలోగల జెర్సీ నగరంలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. నెల్సన్ ఎవెన్యూ ప్రాంతంలో భారతీయులు నివాసముంటున్న ఓ భవనంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే, భవనంలోని భారతీయులందరూ క్షేమంగా ఉన్నారని భారతీయ ఎంబసీ తెలిపింది. ఆ బిల్డింగ్‌లో భారత్‌కు చెందిన 11 మంది విద్యార్థులు, ఓ జంట నివసిస్తున్నారు. వారితో నిరంతరం టచ్‌లో ఉన్నట్టు ఎంబసీ పేర్కొంది. అన్ని రకాల సహాయ సహకారాలూ అందిస్తున్నామని పేర్కొంది. ఘటనపై స్పందించిన నగర అగ్నిమాపక శాఖ.. ప్రమాదంపై త్వరలో నివేదిక విడుదల చేస్తామని తెలిపింది. ఘటనకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు.
Jersey City Fire Accident
NRI
Indian Embassy

More Telugu News