Kesineni Nani: చంద్రబాబు, లోకేశ్ టికెట్లు అమ్ముకుని సొంత రాష్ట్రం తెలంగాణకు వెళ్లిపోతారు: కేశినేని నాని

Kesineni Nani said Cahandrababu and Lokesh will sell tickets and shifted to Telangana
  • టీడీపీ నాయకత్వంపై కేశినేని నాని ఫైర్
  • చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు అని స్పష్టీకరణ
  • టీడీపీ ఆఫీసుకు తాళం వేసుకుని వెళ్లిపోతారని వెల్లడి
  • జగన్ ను చూసి చంద్రబాబు సిగ్గు తెచ్చుకోవాలని వ్యాఖ్యలు
విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, నారా లోకేశ్ లపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. చంద్రబాబు, లోకేశ్ ఎన్నికల్లో టికెట్లు అమ్ముకుని వారి సొంత రాష్ట్రం తెలంగాణకు వెళ్లిపోతారని అన్నారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు అని స్పష్టం చేశారు. అమరావతి ప్రాంతంలో వారికి ఇల్లు కూడా లేదని, ఎన్నికలు అయిపోయాక టీడీపీ ఆఫీసుకు తాళం వేసుకుని హైదరాబాద్ వెళ్లిపోతారని కేశినేని వ్యాఖ్యానించారు. 

"ఈ సందర్భంగా చంద్రబాబునాయుడికి చెబుతున్నా... జగన్ మోహన్ రెడ్డిని చూసి బుద్ధి తెచ్చుకో. బుద్ధి కూడా కాదు... సిగ్గు తెచ్చుకో. ఆయనేమో పేదలకు సీట్లు ఇస్తున్నాడు, నువ్వేమో సీట్లు అమ్ముకుంటున్నావు. చంద్రబాబు, ఆయన పనికిమాలిన కొడుకు లోకేశం గారు ఎన్నికల టికెట్లు అమ్ముకుని ఆ డబ్బు పోగు చేసుకుని, తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోతారు" అని కేశినేని నాని పేర్కొన్నారు.
Kesineni Nani
Chandrababu
Nara Lokesh
Tickets
Elections
Jagan
YSRCP
TDP
Andhra Pradesh
Telangana

More Telugu News