G. Kishan Reddy: సోనియా గాంధీ కుటుంబానికి భారతరత్న ఇచ్చుకున్న కాంగ్రెస్... పీవీకి ఇవ్వలేదు: కిషన్ రెడ్డి

Kishan Reddy questions congress party for not giving bharat ratna to pv
  • కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శ
  • తెలంగాణ పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడినట్లు అయిందన్న కిషన్ రెడ్డి
  • పీవీ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అయినప్పటికీ తాము భారతరత్న ప్రకటించామన్న కేంద్రమంత్రి
కాంగ్రెస్ పార్టీ... సోనియా గాంధీ కుటుంబానికి భారతరత్న ఇచ్చుకుందని... కానీ ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చి దేశాన్ని కాపాడిన అదే పార్టీ నాయకుడు పీవీ నరసింహారావుకు మాత్రం ఇవ్వలేదని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... పీవీ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అయినప్పటికీ తాము భారతరత్న ప్రకటించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. ప్రస్తుతం తెలంగాణ పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడినట్లు అయిందన్నారు. అమలు సాధ్యం కాని ఎన్నో హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.

రాహుల్ గాంధీ ఆదేశాలతో గుత్తేదారులను బెదిరించి సూట్ కేసులు ఢిల్లీకి మోసుకెళుతున్నారని ఆరోపించారు.  కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు తేడా లేదని... ఇవి నాణేనికి బొమ్మ-బొరుసు వంటివన్నారు. ఈ రెండు పార్టీలు కూడా మజ్లిస్ అడుగుజాడల్లో నడుస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ హయాంలో కుంభకోణాలు జరిగాయన్నారు. కుంభకోణాల పార్టీలు ఇప్పుడు కుమ్మక్కయ్యాయని వ్యాఖ్యానించారు.
G. Kishan Reddy
Telangana
BJP
Congress
PV Narasimha Rao

More Telugu News