Nepal Bride: పెద్దలను ఒప్పించి నేపాల్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన పెనుమూరు అబ్బాయి

Penumuru Groom ties knot with Nepal bride
  • లండన్‌లో ఉద్యోగం చేస్తున్న భువన్‌కృష్ణ
  • అదే కంపెనీలో పనిచేస్తున్న మనీల
  • నాలుగేళ్లుగా ప్రేమలో మునిగితేలుతున్న జంట
  • ఈ తెల్లవారుజామున చిత్తూరులో వివాహం
అమెరికా, జపాన్, చైనా వంటి విదేశీ అమ్మాయి మెడలో మన అబ్బాయిలు తాళి కట్టడం ఇటీవల సర్వసాధారణంగా మారింది. అయితే, ఈసారి మాత్రం వధువు దేశం మారింది. పొరుగుదేశం నేపాల్‌కు చెందిన అమ్మాయి మెడలో చిత్తూరు జిల్లా పెనుమూరు అబ్బాయి తాళి కట్టాడు. అబ్బాయి అమ్మాయి ఇద్దరూ తల్లిదండ్రులను ఒప్పించి మరీ తమ ప్రేమబంధాన్ని శాశ్వతం చేసుకున్నారు.

పెనుమూరుకు చెందిన భువన్‌కృష్ణ లండన్‌లో ఉద్యోగం చేస్తుండగా, నేపాల్ అమ్మాయి జి. మనీల కూడా అతడు చేస్తున్న కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. వీరిద్దరి మధ్య జరిగిన పరిచయం ప్రేమకు దారితీసింది. నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ పెళ్లితో ఒక్కటి కావాలని భావించారు. విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు.  పెద్దలు సంతోషంగా వీరి ప్రేమను అంగీకరించారు. ఈ తెల్లవారుజామున చిత్తూరులోని ఓ హోటల్‌లో వీరి విహహం అంగరంగ వైభవంగా జరిగింది.
Nepal Bride
Penumur Groom
Chittoor District
Wedding

More Telugu News