Telangana: తెలంగాణలో 95 మంది డీఎస్పీల బదిలీ

  • 95 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ రవిగుప్తా
  • హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల్లో కొనసాగుతున్న డీఎస్పీలను, ఏసీపీలను బదిలీ చేస్తూ ఆదేశాలు
  • గత మూడేళ్లుగా ఒకేచోట పని చేస్తోన్న, సొంత జిల్లాల్లో పని చేస్తోన్న అధికారుల బదిలీ
95 DSPs transferred in telangana

తెలంగాణలో 95 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు.  ఇప్పటికే రెవెన్యూ, ఆబ్కారీ, పంచాయతీరాజ్ శాఖలలో అధికారుల బదిలీలు జరిగాయి. తాజాగా పోలీస్ శాఖలో భారీగా బదిలీలను చేబట్టారు. వివిధ ప్రాంతాల్లో పని చేస్తోన్న 95 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ రవిగుప్తా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల్లో కొనసాగుతున్న డీఎస్పీలను, ఏసీపీలను బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ అధికారులను బదిలీ చేసినట్లుగా తెలుస్తోంది. గత మూడేళ్లుగా ఒకేచోట పని చేస్తోన్న, సొంత జిల్లాల్లో పని చేస్తోన్న అధికారులను బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ గత డిసెంబర్‌లో ఆదేశించింది. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వం అధికారులను బదిలీ చేసింది.

More Telugu News