Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసిన నటి శిల్పాశెట్టి

Actress Shilpa Shetty wrote a letter to Prime Minister Narendra Modi on Ram Mandir inauguration in Ayodhya
  • అయోధ్య రామాలయాన్ని పునర్నిర్మించి చరిత్ర తిరగరాశారని ప్రశంస
  • లక్షలాది మంది కలలను నెరవేర్చారని ప్రశంసలు 
  • ‘ఎక్స్’ వేదికగా లేఖను షేర్ చేసిన మహారాష్ట్ర బీజేపీ విభాగం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ప్రముఖ సినీ నటి శిల్పాశెట్టి లేఖ రాసింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం, ప్రారంభోత్సవానికి మోదీ చేసిన కృషికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. బాలరాముడు మందిరాన్ని నిర్మించి లక్షలాది మంది ప్రజల కలలను నెరవేర్చారంటూ అభినందనలు తెలిపారు. ఈ మేరకు హిందీలో శిల్పాశెట్టి లేఖ రాశారు. 

 ‘‘కొంతమంది చరిత్రను చదువుతారు. మరికొందరు చరిత్ర నుంచి నేర్చుకుంటారు. కానీ మీ (ప్రధాని మోదీ) లాంటి వ్యక్తులు చరిత్రను తిరగరాసే అసాధారణ శక్తిసామర్థ్యాలు కలిగివుంటారు. మీరు 500 ఏళ్ల రామజన్మభూమి చరిత్రను తిరగరాశారు. ఇందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ శుభప్రదమైన ఈ కార్యాన్ని సాధించిన మీ పేరు ఆ శ్రీరాముడితో పాటు ఎప్పటికీ నిలిచి ఉంటుంది’’ అని లేఖలో పేర్కొన్నారు.

కాగా శిల్పాశెట్టి రాసిన లేఖను బీజేపీ మహారాష్ట్ర విభాగం సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. కాగా జనవరి 22, 2024న అయోధ్యలో శ్రీబాల రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన విషయం తెలిసిందే. వైభవోపేతంగా జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పలు రంగాలకు చెందిన భారతీయ ప్రముఖులు పాల్గొన్నారు.  
Narendra Modi
Shilpa Shetty
Ayodhya Ram Mandir
Ayodhya
BJP

More Telugu News