Indira Gandhi: జాతీయ చలనచిత్ర అవార్డులకు ఇందిరాగాంధీ, నర్గీస్ పేర్ల తొలగింపు

Indira Gandhi and Nargis Dutt names removed from National Feature Film awards
  • జాతీయ చలనచిత్ర అవార్డుల్లో మార్పులు
  • ఇప్పటివరకు ఇందిరాగాంధీ పేరిట ఉత్తమ తొలి చిత్రం అవార్డు 
  • నర్గీస్ దత్ పేరిట జాతీయ సమగ్రతా చిత్రం అవార్డు 
  • ఈ రెండు అవార్డుల పేర్ల తొలగింపు
జాతీయ చలనచిత్ర అవార్డులకు దేశంలో ఎంతో గుర్తింపు ఉంది. అయితే ఈ జాతీయ అవార్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, ప్రముఖ బాలీవుడ్ నటి నర్గీస్ దత్ ల పేరు మీద ఉన్న అవార్డులుకు వారి పేర్లను తొలగిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇప్పటివరకు ఉత్తమ తొలి చిత్రం అవార్డును ఇందిరాగాంధీ పేరిట ఇచ్చేవారు. జాతీయ సమగ్రతపై వచ్చే చిత్రాల్లో ఉత్తమ చిత్రానికి నర్గీస్ దత్ పేరిట అవార్డు ఇచ్చేవారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నియమించిన కమిటీ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మార్పులకు కమిటీలో ఏకగ్రీవ ఆమోదం లభించిందని ఓ సభ్యుడు వెల్లడించారు.
Indira Gandhi
Nargis Dutt
Nationa Film Awards
India

More Telugu News