IPL: ఎన్నికలు ఉన్నప్పటికీ... భారత్ లోనే ఐపీఎల్ పోటీలు

IPL likely held in India despite general elections in summer
  • భారత్ లో మరి కొన్ని నెలల్లో ఎన్నికలు
  • అదే సమయంలో ఐపీఎల్ పోటీలు
  • వివరణ ఇచ్చిన ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్
  • ఈసీ ఎన్నికల షెడ్యూల్ ను బట్టి తాము మ్యాచ్ ల తేదీలు నిర్ణయిస్తామని వెల్లడి 
భారత్ లో ఈ వేసవిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, ఐపీఎల్ పోటీలను ఈ ఏడాది దుబాయ్ లో నిర్వహిస్తారంటూ వార్తలు వచ్చాయి. దీనిపై ఐపీఎల్ పాలకమండలి చైర్మన్ అరుణ్ ధుమాల్ స్పందించారు. ఈ సంవత్సరం ఐపీఎల్ టోర్నీ భారత్ లోనే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 

అయితే, ఎన్నికలు ఉండడంతో కేంద్ర ప్రభుత్వంతోనూ, ఇతర సంస్థలతోనూ చర్చించి ఐపీఎల్ షెడ్యూల్ ను ఖరారు చేస్తామని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాతే తాము ఐపీఎల్ షెడ్యూల్ ను విడుదల చేస్తామని ధుమాల్ వివరించారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు. 

దాదాపుగా ఐపీఎల్ పోటీలు మార్చి చివరి వారంలో మొదలయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. సాధారణ ఎన్నికలు ఏప్రిల్ లో జరగొచ్చని అనుకుంటున్నామని తెలిపారు.
IPL
India
Elections
BCCI

More Telugu News