Upasana: వాలెంటైన్స్ డే సందర్భంగా ఉపాసన స్పెషల్ ఫొటో ట్వీట్

Upasana Konidela Special Photo On The Eve Of Valentains Day
  • క్లీంకార, రాంచరణ్ చేతిలో చేయి వేసిన సింబాలిక్ ఫొటో 
  • పదకొండేళ్ల ప్రేమకు ప్రతిరూపం
  • లవ్ లీ కపుల్ అంటూ కామెంట్లు పెడుతున్న అభిమానులు
ప్రేమికుల రోజు సందర్భంగా రామ్ చరణ్ అర్ధాంగి ఉపాసన ఓ అరుదైన ఫొటోను ట్వీట్ చేశారు. పదకొండేళ్ల ప్రేమకు ప్రతిరూపం అంటూ సింబాలిక్ గా తన భర్త, కూతురు చేతిలో చేయి వేసి ఫొటొ దిగారు. మెగా ఫ్యామిలీ అభిమానుల కోసం ఈ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తల్లీదండ్రుల చేతుల్లో క్లీంకార చిట్టి చేతిని చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లవ్ లీ కపుల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

అపోలో హాస్పిటల్ కో ఫౌండర్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసన, మెగా హీరో రామ్ చరణ్ బాల్య స్నేహితులు. దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమించుకుని, పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా ఎంట్రపెన్యూర్ గా రాణిస్తూనే సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉపాసన ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ మెగా ఫ్యామిలీ అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటారు. ఈ దంపతులకు పదకొండేళ్ల నిరీక్షణ తర్వాత కూతురు పుట్టిన విషయం తెలిసిందే. తన ముద్దుల మనవరాలికి మెగాస్టార్ చిరంజీవి క్లీంకార అంటూ నామకరణం చేశారు.

Upasana
valentains day
klinkara
mega family
Ramcharan
megastar

More Telugu News