Dhulipala Narendra Kumar: సలహాల రెడ్డి రెండు చోట్ల దొంగ ఓట్లతో అడ్డంగా దొరికిపోయాడు: ధూళిపాళ్ల

Dhulipalla fires alleges Sajjala family have votes in two places
  • దొంగ ఓట్ల దందా తాడేపల్లి ప్యాలెస్ నుంచే నడుస్తోందన్న ధూళిపాళ్ల
  • సజ్జల కుటుంబానికి పొన్నూరు, మంగళగిరిలో ఓట్లు ఉన్నాయని ఆరోపణ
  • ఆధారాలతో సహా ట్వీట్

రాష్ట్రంలో దొంగ ఓట్ల దందాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా తాడేపల్లిలోనే వుందని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల కుటుంబానికి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయంటూ ఓటరు కార్డు వివరాలతో సహా ట్వీట్ చేశారు. 

క్యాంప్ ఆఫీసు క్లర్క్ రెడ్ హ్యాండెడ్ గా బుక్ అయ్యాడని, రెండు చోట్ల దొంగ ఓట్లతో సలహాల రెడ్డి అడ్డంగా దొరికిపోయాడని ధూళిపాళ్ల పేర్కొన్నారు. పొన్నూరులో ఒక ఓటు ఉందని, మంగళగిరిలో మరో ఓటు ఉందని వెల్లడించారు. 

"తాడేపల్లి ప్యాలెస్ లోనే దొంగ ఓట్ల దందా మొదలైందనడానికి ఇదిగో సాక్ష్యం. తెల్లవారితే మైక్ ముందు నీతి వాక్యాలు వల్లించే క్యాంప్ ఆఫీస్ క్లర్క్ సజ్జల అండ్ ఫ్యామిలీకి రెండు నియోజకవర్గాల్లో ఓట్లు" అంటూ తన ట్వీట్ లో వివరించారు.

  • Loading...

More Telugu News