Dattaji Rao Gaekwad: భారత మాజీ క్రికెటర్ దత్తా గైక్వాడ్ కన్నుమూత

India former cricketer Dattaji Rao Gaekwad passes away
  • 95 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచిన దత్తా గైక్వాడ్
  • 50వ దశకంలో భారత జట్టుకు ఆడిన వైనం
  • కెరీర్ లో 11 టెస్టుల్లో భారత్ కు ప్రాతినిధ్యం
  • 4 టెస్టుల్లో భారతకు నాయకత్వం

భారత క్రికెట్ దిగ్గజం అంశుమన్ గైక్వాడ్ తండ్రి, మాజీ క్రికెటర్ దత్తా గైక్వాడ్ కన్నుమూశారు. ఆయన వయసు 95 సంవత్సరాలు. ఆయన పూర్తి పేరు దత్తాజీ రావ్ గైక్వాడ్. బరోడాలోని తన నివాసంలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. కెరీర్ లో 11 టెస్టులాడిన ఈ సీనియర్ గైక్వాడ్, 4 టెస్టుల్లో భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించారు. టెస్టుల్లో ఆయన అత్యధిక వ్యక్తిగత స్కోరు 52 పరుగులు. 

రంజీ ట్రోఫీలో 3,139 పరుగులు చేశారు. వాటిలో 14 సెంచరీలు ఉన్నాయి. దేశవాళీల్లో దత్తా గైక్వాడ్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 249 పరుగులు. ఆయన బౌలర్ కూడా. దేశవాళీ పోటీల్లో 25 వికెట్లు పడగొట్టారు. 50వ దశకంలో భారత క్రికెట్ జట్టు ప్రధాన ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు పొందారు.

  • Loading...

More Telugu News