Numaish: ఈ నెల 18 వరకు నుమాయిష్ పొడిగింపు

Last day of Numaish 2024 extended till Feb 18
  • శుక్రవారంతో ముగియాల్సిన ఎగ్జిబిషన్
  • పొడిగింపునకు సందర్శకుల డిమాండ్, ట్రేడర్ల విజ్ఞప్తి
  • వారాంతం వరకూ కొనసాగించాలని ఏఐఐఈఎస్ నిర్ణయం
హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగుతున్న నుమాయిష్ ప్రదర్శనను మరో మూడు రోజులు కొనసాగించనున్నారు. సందర్శకుల డిమాండ్, ట్రేడర్ల విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ సొసైటీ (ఏఐఐఈఎస్) ప్రకటించింది. దీంతో ఈ నెల 15తో ముగియనున్న నుమాయిష్ మరో మూడు రోజులు.. అంటే ఈ 18 వరకు కొనసాగనుంది. ఏఐఐఈఎస్ నిర్ణయంపై నుమాయిష్ సందర్శకులు, ట్రేడర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

షెడ్యూల్ ప్రకారం ఏటా జనవరి 1న నుమాయిష్ మొదలై ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతుంది. గడువు దగ్గర పడుతుండడంతో సందర్శకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. సోమవారం సందర్శకుల రద్దీ చాలా ఎక్కువగా ఉందని ఎగ్జిబిషన్ సొసైటీ తెలిపింది. రద్దీ నేపథ్యంలో ప్రదర్శనను పొడిగించాలని ట్రేడర్లు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆదివారం వరకు నుమాయిష్ ను కొనసాగించనున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ తెలిపింది.
Numaish
extended
Feb 17
AIIES
Exibition Socity
Nampally Exibition

More Telugu News