Kodandaram: అస్వస్థతకు గురైన ప్రొ.కోదండరామ్

prof kodandaram unwell
  • డీహైడ్రేషన్ బారిన పడ్డ టీజేఎస్ అధ్యక్షుడు
  • ఐదు రోజులుగా తార్నాకలోని తన నివాసంలోనే విశ్రాంతి
  • ప్రస్తుతం కోదండరామ్ ఆరోగ్యం మెరుగైందన్న పార్టీ వర్గాలు
టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ డీహైడ్రేషన్‌కు గురయ్యారు. గత ఐదు రోజులుగా ఆయన తార్నాకలోని తన నివాసంలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. వారం నుంచి పార్టీ ఆఫీసుకు, ఇతర కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవలే ఆసుపత్రిలో ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం కోదండరామ్ ఆరోగ్యం మెరుగైందని, త్వరలోనే ఆయన పార్టీ ఆఫీసుకు వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Kodandaram
TJS
Telangana

More Telugu News