Bitcoin: పరుగులు పెడుతున్న బిట్‌కాయిన్.. గత రెండేళ్లలో తొలిసారి 50,000 డాలర్ల స్థాయికి పెరుగుదల

Bitcoin for the first time in the last two years has increased to the level of 50000 dollars
  • ఏడాది చివర్లో వడ్డీ రేట్లు తగ్గొచ్చనే అంచనాలతో దూసుకెళ్తున్న అతి పెద్ద క్రిప్టో కరెన్సీ
  • ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 16.3 శాతం పెరుగుదల
  • మిగతా క్రిప్టో కరెన్సీలలోనూ కనిపిస్తున్న జోరు
ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన ‘బిట్‌కాయిన్’ పరుగులు పెడుతోంది. గణనీయమైన వృద్ధితో దూసుకెళ్తోంది. గత రెండేళ్లలో తొలిసారి 50 వేల డాలర్ల మార్క్‌ను బిట్‌కాయిన్ తాకింది. ఈ ఏడాది చివరిలో వడ్డీ రేట్లు తగ్గవచ్చుననే అంచనాలు ఈ క్రిప్టో కరెన్సీ పెరుగుదలకు దోహదపడుతున్నాయి. మరోవైపు బిట్‌కాయిన్ ధరను ట్రాక్ చేసేందుకు యూఎస్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్‌కు గత నెలలో నియంత్రణ సంస్థ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడం కూడా సానుకూలంగా మారింది. 

కాగా బిట్‌కాయిన్ ధర ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 16.3 శాతం పెరిగింది. డిసెంబరు 27, 2021 తర్వాత తొలిసారి నిన్న (సోమవారం) అత్యధిక స్థాయి 50,196 డాలర్ల మార్క్‌ను తాకింది. గత నెలలో ఈటీఎఫ్‌ స్పాట్‌ ప్రారంభించిన తర్వాత బిట్‌కాయిన్‌ 50 వేల డాలర్ల మైలురాయిని తాకడం అత్యంత కీలకమైనదని క్రిప్టో లెండింగ్ సంస్థ ‘నెగ్జో’ సహ వ్యవస్థాపకుడు ఆంటోని ట్రెంచెవ్ అన్నారు. ఇది కీలకమైన స్థాయి అని, 20 శాతం విక్రయాలకు అవకాశం కూడా ఉందని అన్నారు.

కాగా బిట్‌కాయిన్‌తో పాటు ఇతర క్రిప్టో కరెన్సీలు కూడా సోమవారం గణనీయంగా వృద్ధి చెందాయి. రెండవ అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన ఈథర్ విలువ 4.08 శాతం పెరిగి 2,606.60 డాలర్లకు చేరింది. ఇక కాయిన్‌బేస్ 4.86 శాతం, రియోట్ ప్లాట్‌ఫారమ్‌ 11.9 శాతం, మారథాన్ డిజిటల్ 13.7 శాతం చొప్పున వృద్ధి చెందాయి. ఇక బిట్‌కాయిన్ షేర్లను గణనీయ సంఖ్యలో కొనుగోలు చేసిన సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోస్ట్రాటజీ షేర్లు కూడా 11.7 శాతం మేర వృద్ధి చెందాయి.
Bitcoin
cryptocurrency
USA
ether

More Telugu News