Hari Hara Veera Mallu: అంతర్జాతీయ నిపుణులతో పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' గ్రాఫిక్స్ పనులు

High end VFX work for Hari Hara Veera Mallu is going on
  • పవన్ కల్యాణ్ కథానాయకుడిగా హరిహర వీరమల్లు
  • క్రిష్ దర్శకత్వంలో భారీ పీరియాడికల్ మూవీ
  • శక్తిమంతమైన బందిపోటు పాత్ర పోషిస్తున్న పవన్
  • ప్రపంచంలోని వివిధ ప్రదేశాల్లో హై ఎండ్ వీఎఫ్ఎక్స్ పనులు
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో వస్తున్న పీరియాడికల్ మూవీ 'హరిహర వీరమల్లు'. మెగాసూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏఎం రత్నం సమర్పణలో ఏ.దయాకర్ రావు నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై పవన్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో పవన్ కల్యాణ్ ఓ శక్తిమంతమైన బందిపోటు పాత్ర పోషిస్తున్నారు. 

తాజాగా ఈ చిత్రం నుంచి కీలక అప్ డేట్ విడుదలైంది. ప్రస్తుతం 'హరిహర వీరమల్లు' చిత్రం హై ఎండ్ వీఎఫ్ఎక్స్ పనులు జరుపుకుంటోంది. ఇరాన్, కెనడా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రదేశాల్లో అంతర్జాతీయ నిపుణులు 'హరిహర వీరమల్లు' గ్రాఫిక్స్ పనుల్లో పాలుపంచుకుంటున్నారు. 

అద్భుతమైన గ్రాఫిక్స్ నైపుణ్యానికి నిదర్శనంలా, ప్రేక్షకుల ఊహకు అందని రీతిలో సన్నివేశాలను గ్రాఫిక్స్ తో మిళితం చేసి సరికొత్త థ్రిల్ ను అందిస్తామని చిత్రబృందం ప్రకటించింది. త్వరలోనే స్పెషల్ ప్రోమో తీసుకువస్తామని, ఆడియన్స్ విపరీతమైన ఉద్విగ్నతకు గురికావడం ఖాయమని పేర్కొంది.
Hari Hara Veera Mallu
VFX
Pawan Kalyan
Krish
Mega Surya Production
Tollywood

More Telugu News