BRS: ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ సాధించిన తొలి విజయం ఇదీ.. మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్

This is the first victory of the BRS party as an opposition party Ex minister KTR reacted on X
  • కృష్ణా నది ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రానికి అప్పగించలేమంటూ నేడు అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రవేశపెట్టనున్న తీర్మానం బీఆర్ఎస్ విజయమన్న కేటీఆర్
  • బీఆర్ఎస్ తలపెట్టిన ‘ఛలో నల్గొండ ఎఫెక్ట్’ అని వ్యాఖ్య
  • ప్రధాన ప్రతిక్షంగా ఇదే తొలి గెలుపు అన్న కేటీఆర్
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా ఆసక్తికరంగా స్పందించారు. కృష్ణా నది ప్రాజెక్టుల నిర్వహణను కేఆర్ఎంబీకి అప్పగించలేమంటూ కాంగ్రెస్ పార్టీ నేడు (సోమవారం) అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న తీర్మానం బీఆర్ఎస్ సాధించిన విజయమని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ ‘ఛలో నల్గొండ ఎఫెక్ట్!’ అని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 

కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడానికి నిరసనగా రేపు (మంగళవారం) నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన 'ఛలో నల్గొండ' సభ సృష్టించిన ఒత్తిడి కారణంగానే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించలేమంటూ కాంగ్రెస్ పార్టీ నేడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనుందని ఆయన ప్రస్తావించారు. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ సాధించిన తొలి విజయం ఇదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
BRS
KTR
Telangana
Congress

More Telugu News