Sourav Ganguly: ఇంట్లోనే ఫోన్ పోగొట్టుకున్న సౌరవ్ గంగూలీ... పోలీసులకు ఫిర్యాదు

Ganguly phone went missing in his residence
  • జనవరి 19 నుంచి కనిపించకుండా పోయిన ఫోన్
  • ఫోన్ ఇంట్లోనే పెట్టానన్న గంగూలీ
  • అందులో కీలక సమాచారం, ఖాతాల వివరాలు  ఉన్నాయని వెల్లడి
  • కోల్ కతాలోని ఠాకూర్ పూర్ పీఎస్ లో ఫిర్యాదు

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఖరీదైన ఫోన్ పోగొట్టుకున్నారు. గంగూలీ కోల్ కతాలోని బెహాలా ప్రాంతంలో నివసిస్తున్నారు. అయితే, తాను ఇంట్లో ఉన్నప్పుడే రూ.1.6 లక్షల విలువైన ఫోన్ మాయం అయిందని గంగూలీ పోలీసులను ఆశ్రయించారు. ఫోన్ ను ఇంట్లోనే పెట్టానని, కానీ కనిపించడంలేదని ఆయన ఠాకూర్ పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

"ఫోన్ మా ఇంట్లోనే పోయిందని భావిస్తున్నాను. జనవరి 19న ఉదయం 11.30 గంటలకు ఫోన్ ను చివరిసారిగా చూశాను. ఆ తర్వాత ఫోన్ ను కనుగొనేందుకు ఎంత ప్రయత్నించినా అది ఎక్కడుందో కనిపించలేదు. ఫోన్ పోయినందుకు చాలా బాధగా ఉంది. అందులో చాలామంది కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయి. కీలకమైన వ్యక్తిగత సమాచారంతో పాటు ఖాతాల వివరాలు కూడా ఉన్నాయి" అని గంగూలీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News