AP JAC: రేపు చర్చలకు రావాలంటూ ఉద్యోగ సంఘాల నేతలకు ఏపీ ప్రభుత్వం ఆహ్వానం

AP Govt invites Employees associations leaders for talks
  • ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన ఉద్యోగ సంఘాలు
  • అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
  • రేపు మధ్యాహ్నం సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో చర్చలు
ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో 104 ఉద్యోగ సంఘాలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించడంపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రేపు చర్చలకు రావాలంటూ ఉద్యోగ సంఘాల నేతలను ప్రభుత్వం ఆహ్వానించింది. ఫిబ్రవరి 12న మధ్యాహ్నం 3.30 గంటలకు సచివాలయానికి రావాలని పిలుపునిచ్చింది. ఉద్యోగ సంఘాల ఉద్యమ కార్యాచరణ నేపథ్యంలో, ఉద్యోగుల పెండింగ్  సమస్యలపై చర్చించాలని మంత్రుల బృందం నిర్ణయించింది. 

ప్రభుత్వం తమకు రూ.6,700 కోట్లు బకాయిలు పడిందని, గత నాలుగేళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. నాలుగు డీఏలు, సరెండర్ లీవులు, పదవీ విరమణ బకాయిలు చెల్లించాలని ఉద్యోగులు కోరుతున్నారు.
AP JAC
Employees
YCP Govt
Andhra Pradesh

More Telugu News